PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. చెత్త సంపద కేంద్రాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పచ్చదనం పరిశుభ్రంగా పల్లెలు ఉండాలని ఆశయంతో స్వచ్ఛభారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన చెత్త సంపద కేంద్రాలు బార్ అండ్ రెస్టారెంట్ గా మారాయి గ్రీన్ అంబాసిడర్ల జీతాలు సరైన సమయంలో ఇవ్వక తెచ్చిన ఆరకొర చెత్తతో సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేయలేక చెత్త సంపద కేంద్రాలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలాయి గ్రామాలలో ఇళ్ల వద్దకు వెళ్లి సేకరించిన తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్టు సేంద్రీయ ఉత్పత్తి లక్ష్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఎంపీడీవో పర్యవేక్షణలో నిర్మితమైన చెత్త సంపద కేంద్రాలకు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ ఓ అర్ డీ బాస్ గా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కుర్చీల కే పరిమితం కావడంతో రోజు సేకరించాల్సిన తడి పొడి చెత్త తీసుకు వెళ్లడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రోడ్డు వెంబడి చెత్తాచెదారం పడి ఉండడం గ్రామాలను అద్దాల్ల మారుస్తామన్న అధికారులు జిల్లాస్థాయి అధికారులు వచ్చినప్పుడు తూతూ మంత్రంగా పర్యటించి అంతా బాగుందని చూపించడం తప్పితే రోజు వారి చెత్త సేకరణలో ఎటువంటి పారదర్శకత లేదని ఇష్టం వచ్చినప్పుడు ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నారని అసలు చెత్త సంపద కేంద్రాలు ప్రతి గ్రామానికి ఉన్నాయి అలాగే మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది పైగా పక్కనే నాడే కంపోసిట్ బ్లాక్ లు తయారుచేసి లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఊరికి దూరంగా షెడ్లు వేసి వదిలేయడం తప్ప రోజువారి సమీక్షలు నిర్వహించడం ఎప్పుడో మానేశారు ఆఖరుకు మద్యం సేవించడానికి బార్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచిపోయాయి … మండల వ్యాప్తంగా ఉన్న చెత్త సంపద కేంద్రాల్లో ఇప్పటివరకు రైతులకు సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవని అసలు సేంద్రియ ఎరువు మాటేరుగమని రైతులు చెప్పడం కొసమెరుపు.

About Author