PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా హనుమాన్ చాలీసా

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల కేంద్రమైన ప్రధాన రామాలయం రాధాకృష్ణ మందిరంలో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ భక్త రామదాసు స్వామి శిష్య బృందం చే హరే రామ సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది. హనుమాన్ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూల అలంకరణ పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రెండు గంటల వరకు హరే రామ సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

About Author