PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50% శాతం సబ్సిడీ NCDC రుణాలలో ఇవ్వాలి

1 min read

– NCDC రుణాలు 50% తో రెండో విడత వెంటనే మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్
– వై. నాగేశ్వరరావు యాదవ్, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్
– తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం కర్నూలులోని షీప్స్ కోఆపరేటివ్స. డెవలప్మెంట్ ఆఫీస్ నందు జిల్లా యూనియన్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఈ. D. సుభాన్ మరియు యూనియన్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా J. D. రామచంద్రయ్య గారు డాక్టర్ శ్రీనివాస రెడ్డి గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మురళి మనోహర్, రంగనాధమయ్య , సుబ్బయ్య, పుల్లయ్య, జయరాముడు లక్ష్మన్న, గోకారి మరియు నారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ పశు నష్టం బీమా పథకం ద్వారా అందాల్సిన డబ్బులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పశు నష్టం భీమ పథకాన్ని అలాగే కొనసాగించాలి. గొర్రెలు మేపుకోవడానికి పచ్చిక బయలను సొసైటీకి ఏర్పాటు చేయాలి. కిసాన్ క్రెడిట్ కార్డ్ సహాయ పథకాన్ని గొర్రెల పెంపకం దారులు వినియోగించుకోవాలని కోరడమైనది. జీవాలకు మందులను, డివార్మింగ్ వేయించాలని కోరడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగే సొసైటీని డెవలప్ చేయాలి. ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలి. అలాగే 50% శాతం సబ్సిడీ ఇన్సిడిసి రుణాలలో ఇవ్వాలి. గీత, చేనేత కార్మికుల మాదిరిగానే 50 సంవత్సరాలు నిండిన వెంటనే జీవాలు మేపే వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలి. గొర్రెల మరియు మేకల అభివృద్ధి యూనియన్ డైరెక్టర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.

About Author