PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ టీం విజయకేతనం ..జోరుగా క్రికెట్ పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: సంక్రాంతి పండగ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో భాగంగా బుధవారం నాడు క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగాయి. అందులో భాగంగా పోలీస్ టీం ఇతర టీమ్లతో తలపడి రెండు మ్యాచ్లను గెలిచి విజయం సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులు అభినందించారు. మొదటి మ్యాచ్ పోలీస్ టీం వర్సెస్ గడివేముల టీం లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రామాచారి అర్థ సెంచరీ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుపొందారు రెండవ మ్యాచ్ పోలీస్ టీం వర్సెస్ గ్రంధివేముల మ్యాచ్ లో గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య తన విశ్వరూపం చూపించి ఐదు వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్ గా నిలబడ్డారు బీటి వెంకటసుబ్బయ్య కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ ను నిర్వాహకులు అందజేశారు.

About Author