PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాక్షన్ గ్రామాల రివ్యూ… జిల్లా ఎస్పీ

1 min read

– సమస్యాత్మక , ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల పై గట్టి నిఘా ఉంచాలి.
– పోలీసు స్టేషన్ల ను ఆశ్రయించే భాధితుల ఫిర్యాదుల పై సత్వరమే స్పందించాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ గారు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. ఫ్యాక్షన్ గ్రామాల గురించి రివ్యూ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలను సందర్శించాలన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రస్తుత పరిస్ధితులలో తీసుకోవలసిన జాగ్రత్త లపై , పాత కేసుల గురించి ఆరా తీశారు.,ఫీల్డ్ వర్క్ పై దృష్టి సారించాలన్నారు. PT ట్రయల్ కేసుల లో శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు ముఖ్యమైన ట్రయల్ కేసుల్లో భాద్యతగా తీసుకోవాలన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంపోందించుకోవాలన్నారు. ఆయా గ్రామాల ప్రజల నుండి సమస్యల గురించి సమాచారాన్ని సేకరించాలన్నారు.అక్రమంగా రేషన్ బియ్యం తరలించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ చేయాలన్నారు. కిరాయి హంతకులు, దొంగల ముఠా లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అక్రమ మైనింగ్, క్వారీస్, ఎక్స్ ప్లోజివ్స్ ట్రాన్స్ పోర్టు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలపాలు , ఒపెన్ డ్రింకింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుస్టేషన్ ల పరిధులలో ని శివారు ప్రాంతాలలో పోలీసులు ఫీల్డు లో విధులు నిర్వహించాలన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి జిల్లా సరిహద్దుల (బార్డర్) లో అక్రమ మద్యం రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. పోలీసు స్టేషన్ల కు వచ్చే భాధితుల ఫిర్యాదుల పై సత్వరమే స్పందించాలన్నారు. కర్నూలు , పత్తికొండ , ఆదోని సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న యుఐ కేసులు, గ్రేవ్ కేసులు, ,ఆస్తి నేరాల రికవరీ, POCSO కేసులు, SCST కేసుల పై జిల్లా ఎస్పీ గారు సమీక్షించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, యుగంధర్ బాబు, శ్రీనివాసులు, వినోద్ కుమార్, నాగభూషణం, మహేష్, మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

About Author