NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రామనపల్లి గ్రామంలోని హరిజనవాడలో తలమల నరసమ్మ అనే మహిళ బుధవారం మృతి చెందడంతోఈ విషయాన్ని తెలుసుకున్న అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు గురయ్య గ్రామస్తులు సమక్షంలో అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో తలమల నరసమ్మ అంత్యక్రియలు జరుపుటకు సంఘం తరపున రూ. 2, రూపాయలు ఆర్థిక సహాయం అంద చేయడం జరిగింది, ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు గురయ్యమాట్లాడుతూ, అంబేద్కర్ సేవ ఆధ్వర్యంలో దళితులు ఎవరైనా రామన పల్లి హరిజనవాడలో మరణిస్తే వారికి అండగా తమ వంతు సహాయంగా దహన సంస్కారాల నిమిత్తం 2 వేల రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటు లో ఉంటూ ఆ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం సెక్రటరీ పి, పెంచలయ్య కోశాధికారి వై,బ్రహ్మయ్య , రామనపల్లి హరిజనవాడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author