‘పల్లెవెలుగు’ క్యాలెండర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు, కర్నూలు:గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి… పరిష్కరించే దిశగా వార్తలు రాయడంలో పల్లెవెలుగు దినపత్రిక ముందుంటుందన్నారు హౌసింగ్ డెవలప్మెంట్ మేనేజర్ (హెచ్డీఎఫ్ సీ) పూజల హరిరాఘవేంద్ర. గురువారం పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్ను సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి. హరి రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజలకు..ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పని చేయాలని కోరారు. సమాజంలో అవినీతి రూపుమాపడంలో మీడియాపాత్ర కీలకమన్నారు. మారుతున్న కాలానుగుణంగా పల్లెవెలుగు దినపత్రిక డిజిటల్ మీడియా (వెబ్ మీడియా) వైపు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి… పల్లెవెలుగు డిజిటల్ మీడియా మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ హౌసింగ్ డెవలప్మెంట్ మేనేజర్ పూజల హరిరాఘవేంద్ర ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సిబ్బంది ఉన్నారు.