టీజీవి కుటుంబం నిరంతరం ప్రజలకు సేవలు చేస్తుంది
1 min read– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టీజీబీ యూత్ ఆధ్వర్యంలో రూపొందించిన టీజీవీబీ నూతన సంవత్సరపు క్యాలెండర్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, టీజీబీ యూత్ అధ్యక్షులు టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిజిబి యూత్ నాయకులు రవి, యూనుష్ భాష, గణేష్, టిడిపి నాయకులు అబ్బాస్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీబీ యూత్ నాయకులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా టీజీవి కుటుంబం నిరంతరం ప్రజలకు సేవలు చేస్తుందని వివరించారు. కర్నూల్ నగరంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ,రాజ్యసభ సభ్యులుగా టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని వివరించారు. గత ఎన్నికల్లో యువనేత టీజీ భరత్ దురదృష్టవశాత్తు ఓటమి చెందడంతో కర్నూలు అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో యువనేత టీజీ భరత్ ను గెలిపించడం ద్వారా కర్నూలు మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. టీజీబీ యూత్ ఆధ్వర్యంలో నగరంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు.