అన్ని స్థానాలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
1 min read– ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాలును తిప్పికొట్టాలి
అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: 2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులకు వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంలోని అభికళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన జగనన్న సచివాలయం కన్వీనర్లు,గృహసారథుల (జేసీఎస్) మండల కన్వీనర్లతో జరిగిన సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ ఆకేపాటి అమర నాధ రెడ్డి తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందన్నారు. ప్రజల్లో వైయస్ జగన్ ప్రభుత్వం పై ఉన్న సానుకూల ధోరణిని ఓట్ల రూపంలో తీసుకురావాల్సిన బాధ్యత సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులపై ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే 175 స్థానాలు గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లాలని, ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయ కన్వీనర్లు, గృహ సారధుల పాత్ర కీలకం కానుందని చెప్పారు. రాయలసీమలో సీఎం జగన్ లాంటి ధైర్యమైన నాయకుడు ఉండడం సంతోషదాయ కమన్నారు.చంద్రబాబుకు తనపార్టీపై నమ్మకం ఉంటే ఒంటరిగా పోటీ చేయాలన్నారు. సొంతమామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, అదే వైఎస్ జగన్ ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా సొంతంగా పార్టీని పెట్టి అధికారంలోకి తెచ్చిన ఘనత దక్కుతుందన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.రీజనల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమరనాధ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు.సీఎం జగన్ పాలవ ఆదర్శంగా,పారదర్శకంగా కొనసాగుతోందన్నారు.చంద్రబాబు తన ప్రచార ఆర్భాటాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తన సభలలోనూ, గతంలో జరిగిన గోదావరి పుష్కరాలలో ప్రజలు మృతిచెందినా చంద్రబాబులో పచ్చాతాపం కనపడడం లేదన్నారు.చంద్రబాబే నిజమైన సైకో అని తెలిపారు.సీఎం జగన్ బలమైన నాయకుడు అయినందునే శత్రువులు ఏకమయ్యారన్నారు.ఎనభై శాతం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు.జగనన్న సచివాలయకన్వీనర్లు , గృహసారధుల ఐదు జిల్లాల కో ఆర్డినేటర్ పుత్తా శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా అందిస్తున్నారన్నారు.వైఎస్ఆర్ సిపి కోడూరు పరిశీలకులు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపిలో కష్టపడి పనిచేసిన వారికి తగిన సమయంలో తగిన గుర్తింపు, విలువ ఉంటుందన్నారు.మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి కార్యకర్త, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులుసైనికుల్లా పనిచేయాలని కోరారు.రాజంపేట పరిశీలకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.పీలేరు పరిశీలకులు సహదేవ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు.రాయచోటి పరిశీలకులు కరీముల్లా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,వీరబల్లి ఎంపిపి రాజేంద్ర నాధ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష లతో పాటు జిల్లాలోని సచివాలయాల మండల ఇంచార్జిలు పాల్గొన్నారు.