వైసీపీ నాయకుని పై చర్యలు తీసుకోవాలి..!
1 min read– ప్రభుత్వ స్థలాలను అధికారులు కాపాడాలి..
– బీఎస్పీ , సిపిఐ ,టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గోకులం షెడ్డును కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఇంఛార్జి ఎల్. స్వాములు ,సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు, టిడిపి నాయకులు సుధాకర్ ,బాబు ప్రభుత్వ అధికారులును డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులు ఉమ్మడి పశు పోషణ చేసుకోవాలనే ఉద్దేశంతో జూపాడుబంగ్లా గ్రామంలో సర్వేనెంబర్ 711 లో 25 సెంట్లు భూమిని కేటాయించింది .అక్కడ కొద్దిపాటి నిర్మాణం కూడా జరిగినది.ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు ,ప్రజా ప్రతినిధుల అండదండలతో ఆ భూమిని అక్రమంగా ఆక్రమించి సదును చేస్తున్న కూడా గ్రామ పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు .జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఒక వైసీపీ నాయకుడు భూములు కబ్జా చేస్తున్నాడని తెలిసి కూడా ప్రభుత్వ అధికారులు అతనికి వంత పాడుతున్నారంటే అతని నుంచి అధికారులు కూడా ముడుపులు ముట్టుతున్నాయనే అనుమానిస్తున్నామన్నారు . నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులును సస్పెండ్ చేసి భూ కబ్జా చేస్తున్న వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూవివాదాలపై ఒక ప్రత్యేక అధికారిని నియమించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారి పై పై చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ మంజుల వాణి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వివాదాస్పద మైన గోకులం షెడ్ స్థలాన్ని ఎంపీడీఓ మంజుల వాణి, ఇఓఆర్డీ మణి మంజరి, పశు వైద్య శాఖ ఏడీఏ రామాంజనేయ నాయక్ లతో కలిసి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.