ఈ పూరి ఇక లేరు..
1 min readకరోనాకు మరో సంఘసేవకుడు బలి
స్కూల్ చైర్మన్ గా విద్యార్థులకు ఎనలేని సేవలు
పల్లెవెలుగువెబ్, చిట్వేలి: మండలంలో సంఘ సేవకుడిగా అనతికాలంలోనే గుర్తింపు పొందిన చిత్తూర్ హై స్కూల్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఈ పూరి పెంచలయ్య ఇక లేరన్న వార్త చిట్వేలి మండలాన్ని కలచివేసింది. కరోనా పాజిటివ్ రావడంతో కొంతకాలంగా హోమ్ క్వారంటైన్లో ఉంటున్న పెంచలయ్య కు ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. రెండేళ్ల కిందట చిట్వేల్ హై స్కూల్ మంత్రుల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన పెంచలయ్య.. సేవకు మారు పేరుగా నిలిచారు. హైస్కూల్లోని సుమారు 1700 మంది విద్యార్థినీ విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని సంపాదించాడు. బడికి వెళ్ళిన పిల్లలను రోడ్లమీద తిరగకుండా రాయించడం, పదో తరగతి విద్యార్థులను గాడి తప్పకుండా కూర్చోబెట్టి చదివించడం, భోజనం టైం కాగానే ఆ హై స్కూల్ లోని విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించడం రోజువారీ పనిగా పెట్టుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన విధిని మాత్రం మరవకుండా ఒక్క రోజు కూడా తన విధులకు గైర్హాజరు కాకుండా హైస్కూల్ ఏ దేవాలయం గావించాడు. తన భార్య రెడ్డమ్మ అదే స్కూల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ ద్వారా నాణ్యమైన ఆహారం తో పాటు మెనూ చిత్తశుద్ధిగా అమలయ్యేలా చేయడం భార్యాభర్తలు ఇరువురూ కలిసి విద్యార్థిని విద్యార్థులకు ఆకలి తీరేలా భోజనాలు వడ్డించడం వారి విధిగా పెట్టుకుని ముందుకు సాగారు. పరిస్థితులు వికటించి పెంచలయ్య మృతి చెందడంతో మండల మంతా శోకసంద్రంలో మునిగిపోయింది.