కమ్ముకున్న యుద్ధ మేఘాలు
1 min readపల్లెవెలుగు వెబ్: పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. రెండు దేశాల మధ్య దాడుల్లో అనేక మంది అసువులు బాసారు. క్షతగాత్రులయ్యారు. నిరాశ్రయులుగా మారారు. శాంతి ఒప్పందానికి కట్టుబడాలన్న అంతర్జాతీయం సమాజం అభ్యర్థనను పెడచెవిన పెడుతున్నాయి. పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు తగ్గడంలేదు. ఇజ్రాయిల్ దూకుడు దాడులతో పాలస్తీనియన్లను నిర్వాసిత క్యాంపులకు తరుముతోంది. హమాస్ తీవ్రవాదులు 1800 రాకెట్లతో ఇజ్రాయిల్ మీద దాడి చేశారు. అయితే.. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ తో ఆ రాకెట్లను ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఐదుగురు ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయిల్ పాలస్తీన మీద 600 సార్లు వైమానిక దాడులు చేసింది. భారీ భవంతులు కూల్చివేసింది. ఈఘటనలో 126 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్టు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు యుద్దానికి సిధ్దమన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇరువైపులా సైన్యాలు మోహరించి ఉన్నాయి. ఈజిప్టు మధ్యవర్తిత్వం కూడ ఫలించలేదు.