NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత భవిష్యత్తు టీడీపీ పార్టీతోనే సాధ్యం

1 min read

– తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చమర్తి జగన్ రాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రాజంపేట నియోజకవర్గం, వీరబల్లి మండలం మూడు గ్రామాలకు చెందిన యువత పూర్వ విద్యార్థులు గ్రామ యువతతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఓదివీడు . మట్లి . తాటిగుంటపల్లి. గ్రామపంచాయతీలకు సంబంధించిన సుమారు 300 మందికి పైగా యువత హాజరయ్యారు..ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు గారిని ఘనంగా సన్మానించి,సాధర స్వాగతం పలికారు.అనంతరం ఓ దివీడు గ్రామం రామాపురం వద్ద నిర్వహించిన యువత సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత యువత లక్ష్యమని తెలియజేశారు..విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించడం చంద్రబాబుకే సాధ్యమన. చెప్పారురాష్ట్ర భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం యువతే కీలకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. *యువ గళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు యువత ప్రతి ఒక్కరు కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైస్సార్సీపీ వల్ల రాష్ట్రంతో పాటు యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని యువత ఆందోళన వ్యక్తం చేశారు.పలువురు ఈ సమావేశంలోసాఫ్ట్వేర్ఇంజనీర్లు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యువత ఆహ్వానం మేరకు రామాపురం దగ్గర విందు కార్యక్రమంలో జగన్ రాజు గారు. పాల్గొన్నారుఆయన వెంట వడ్లమూడి రాంప్రసాద్ నాయుడు, గల్ఫ్ ఎన్ఆర్ఐ నాగర్జున చౌదరి, నందకుమార్ నాయుడు,అంజనీ కుమార్,మండల ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, సుధాకర్,భాస్కర్ రాజు,రమణయ్య, సిద్దిరాజు,సుబ్బరామరాజు, కొత్తపల్లి ఆంజనేయులు, గుదే వెంకటరాం ప్రసాద్, పరిటాల సుధాకర,తాండ్ర చంద్రబాబు, అనిల్. తదితరులు ఆయన వెంట పాల్గొన్న వారిలో ఉన్నారు.

About Author