భూమి కబ్జా చేసిన వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జూపాడుబంగ్లా గ్రామంలోని సర్వే నంబర్ 711 లో 25 సెంట్లు భూమిని గత టీడీపీ ప్రభుత్వం గోకులం షెడ్డు నిర్మాణం కోసం కేటాయించారు. అస్థలాన్ని వైసీపీ పార్టీకి చెందిన ప్రధాన అనుచరుడు మండల వైసీపీ నాయకులు ఆ భూమిని కబ్జా చేయడం నందికొట్కూరు నియోజకవర్గంలో సంచలన రేకిత్తించింది.ప్రజా సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు.ఈ నేపథ్యంలో భూ కబ్జాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చేత న్యాయం విచారణ చేయబట్టాలని భూకబ్జా చేసిన వాళ్ళపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ వర్గ సభ్యులు వి .రఘురామమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జూపాడు బంగ్లా గ్రామంలో ఉన్న ఆ స్థలాన్ని సీపీఐ మండల నాయకులు ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జూపాడు బంగ్లా తహశీల్దార్ పుల్లయ్య కు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శాంతయ్య , తదితరుల అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుపోవడం శోచనీయమని ఆరోపించారు.అధికారులే ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవాలని డిమాండ్ చేశారు .ఈ భూ కబ్జాపై ఏలాంటి చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని కాపాడి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఐటీయూసీ నాయకులు సలీం భాష , ఏఐఎస్ ఎఫ్ తాలూకా ఆర్గనైజేషన్ సెక్రటరీ దినేష్ తదితరులు పాల్గొన్నారు.