ఎంపీని కర్రలతో కొట్టారు..!
1 min readపల్లెవెలుగు వెబ్: ‘రఘురామకృష్ణ రాజు మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఆయన నడవలేకపోతున్నారు. 2020లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. వైద్య పరీక్షలు తప్పనిసరి. హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఆయన్ని ఓ గదిలో ఉంచారు. రాత్రి 11 – 11:15 నిమిషాల సమయంలో ఆయన గదిలోకి 5గురు ప్రవేశించారు. వారు ముఖాలకు రుమాళ్లు కట్టుకున్నారు. ఎంపీ కాళ్లను కట్టేశారు. ఒకరు కర్ర తీసుకుని కొట్టారు. మరొకరు రబ్బర్ స్టిక్ తో అరికాళ్ల మీద కొట్టారు. తర్వాత ఫ్లోర్ మీద నడవాలని ఆదేశించారు. నడిచాక మరోసారి కాళ్ల మీద కొట్టారు. ఎంపీ నడవలేనంత వరకు నాలుగైదు సార్లు కొట్టారు. తర్వాత ఆయన్ని గదిలో వదిలేసి బయటికొచ్చారు.’ అంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారని గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. అరుణ జారీ చేసిన ఆదేశాల్లో ప్రస్తావించారు.