PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి

1 min read

– కెంద్ర మంత్రి చౌహాన్,రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువత సమావేశంలో కెంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి చౌహన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి చౌహన్ మాట్లాడుతూ సమాజానికి మంచి చేసే పాలకులను ఎన్నుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని, ఇందుకు ఓటు హక్కు సరైన మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా తమ భవిష్యత్తును నిర్దేశించుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలలో మార్పులు తీసుకువచ్చేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు .యువత రాజకీయాల వైపు దృష్టి సారించి మార్పులకు శ్రీకారం చుట్టాలి అన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు .సరైన నాయకత్వం లేకపోవడం వల్ల జరిగే పరిస్థితులను శ్రీలంక, పాకిస్తాన్ దేశాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్వారా గమనించవచ్చు అని చెప్పారుమ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై యువత దృష్టి సారించకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా శ్రీలంక ,పాకిస్తాన్ తరహా పరిస్థితులు ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై యువత సీరియస్ గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అర్హత ఉన్న యువకులందరూ ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకొని, ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. యువత ముఖ్యంగా ప్రభుత్వ పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని వివరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అన్ని విధాల మంచి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలని ఎన్నుకోవడంలో యువత కీలకపాత్ర పోషించాలని ఆయన తెలియజేశారు .ఇక యువత చదువు విషయంలో దృష్టి సారించాలని, అయితే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలను గుర్తించి అందుకు తగిన కోర్సులను ఎంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రి చౌహన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ తో పాటు అతిధులను జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల తరఫున సన్మానించారు.

About Author