PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డి డి వో లకు ఇన్కమ్ టాక్స్ పై అవగాహన సదస్సు

1 min read

– టీడీఎస్ చేయునప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి
– టీడీఎస్ సరిగా లేకుంటే చర్యలు ఉంటాయి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం ఉదయం కర్నూలు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన డి డి వో లకు ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ (టీడీఎస్ )వార్డ్-1 కర్నూలు… వారి ఆధ్వర్యంలో ఇన్కమ్ టాక్స్ పై అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ శ్రీ నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా , కర్నూలు జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రామచంద్ర రావు గారు అధ్యక్షులుగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి.ఆర్.ఓ నాగేశ్వరరావు గారు మరియు డీ.డీ రామచంద్ర రావు గారులు మాట్లాడుతూ జిల్లా అధికారులకు టాక్స్ డిటెక్షన్ మీద అవగాహన కల్పిస్తూ వారు ఎటువంటి పొరపాట్లు చేయకుండా వారికి తగిన సూచనలు ఇవ్వాలని మరియు ఉద్యోగస్తులు సొంతంగా ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకునే విధంగా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు.ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ శ్రీ.ఎస్.రాజశేఖర్ గారు ( తిరుపతి శాఖ) ఈ సదస్సులో టాక్స్ డిడక్షన్ అట్ సోర్స్( టి.డి.ఎస్ ) ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి , ఏ మాసంలో చేయాలి దానికి సంబంధించిన సూచనలు , రూల్స్ ను విపులంగా వివరించారు. ముఖ్యమైన ఇన్కమ్ టాక్స్ నిబంధనలు ఉదాహరణలతో వివరించడం జరిగినది. ముఖ్యంగా డి డి వో లు సివిల్ కాంట్రాక్టర్లకు , వాహనాలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లకు , ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లకు సొమ్ము చెల్లించేటప్పుడు చేయవలసిన డిడక్షన్స్ ను ఏ విధంగా చేయాలి , ఉద్యోగస్తులకు ట్యాక్స్ డిడక్షన్ ఏ విధంగా చేయాలి అన్న విషయాలను క్షుణ్ణంగా వివరించారు. డి డి వో లు వారికి ఉన్న సంశయాలకు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారు వివరంగా విశదీ కరించినారు . టీడీఎస్ డిడక్షన్ నిబంధనలు పాటించకపోతే డిపార్ట్మెంట్ వారు తీసుకునే చర్యల్లో పెనాల్టీస్ , ప్రాసిక్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయం కూడా వివరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని డి వో లు జాగ్రత్తగా టాక్స్ డిడక్షన్ చేయాలని మరియు కాంట్రాక్టర్ ల మరియు సప్లయర్ ల సందేహాలు తీర్చాలని సూచించారు . ఈ కార్యక్రమంలో కర్నూలు ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. రంగారావు గారు , కలెక్టర్ కార్యాలయం ఏ.ఒ. వెంకటేశ్వర్లు గారు , అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ జయలక్ష్మి గారు , ఎస్టీవో సునీల్ మరియు జిల్లా అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

About Author