మెట్ట ప్రాంత సాగునీరుకై పోరుబాట..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జుపాడు బంగ్లా మండలంలోని శ్రీశైలం నీటి మునక గ్రామాలైన భాస్కరపురం,తంగేడంచ, మండ్లము గ్రామాల మధ్య మెట్ట ప్రాంతాలకు తక్షణమే నాగటూరు లిఫ్ట్ ద్వారా, కేసి కెనాల్ ప్రత్యేక కాలువ ద్వారా నైనా సాగునీరు అందించాలని సాగునీరు సాధనకై సిపిఐ ఆధ్వర్యంలో పోరుబాట పడుతున్నామని సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుండి భాస్కరపురం మండలం గ్రామాల రైతులు సాగును అందించాలని ఎమ్మెల్యే కు అధికారులకు విన్నవించారని అయితే ఎవరు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటైన విషయం అన్నారు. శ్రీశైలం నీటి మునకకు గురైన గ్రామాలకు సాగునీరు అందడం లేదంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.. కేసి కెనాల్ పైన ఉన్న మెట్ట ప్రాంతాలు భాస్కరాపురం మధ్యలో వందలాది ఎకరాలు ఉన్నాయని కొద్దిగా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే సాగునీరు అందే పరిస్థితి ఉందన్నారు. లక్ష్మాపురం వరకు లిఫ్ట్ సాగు నీరు వచ్చాయని అయితే మూడు కిలోమీటర్ల పరిధిలో నీరు ఆగిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదన్నారు.. తక్షణమే ఈ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి సాగునీరు అందించలేని పక్షంలో పోరుబాట తప్పదని వారు హెచ్చరించారు. ఎంతమంది పాలకులు పరిపాలిస్తున్న రైతుల కు మేలు చేయడం లేదన్నారు.రైతులు ఆందోళన చేయకముందే అధికారం యంత్రాంగం దృష్టికి అందికరించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల సిపిఐ నాయకులు వాహిదూదిన,నరసింహ, మాగబుల్ భాషా తదితరులు పాల్గొన్నారు.