మహాగణపతి -సుబ్రహ్మణ్య ధ్వజ సహిత నవ విగ్రహ ప్రతిష్ట
1 min read– ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రామనపల్లి లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం 25, 26వ తేదీ గురువారం నాడు శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్య ధ్వజ సహిత విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది, కాగా ఈ ఆలయంలో కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు పాల్గొని శ్రీ అభయ ఆంజనేయ స్వామి, మహాగణపతి సుబ్రహ్మణ్య ధ్వజ సహిత విగ్రహ ప్రతిష్ట మహోత్స వాళ్లలో భాగంగా స్వామివారిలను దర్శించుకోవడం జరిగింది, ఈ సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆలయ నిర్వాహకులు గ్రామ పెద్దలు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు, నవగ్రహాలు విగ్రహాలు రామనపల్లె పురవీధుల గుండా ఊరేగింపు చేసి గ్రామ ప్రజల పూజలు అందుకుని దేవస్థానం నందు శుక్రవారం విగ్రహ ప్రతిష్ట చేయునట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను వారు ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గురువారం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రాతః కాల పూజలు, యంత్రాభిషేకములు, జపములు, అలాగే పారాయణములు, హోమములు, భర్త పూజలు, అదేవిధంగా యంత్ర స్థాపనములు, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, జ్వాలా దర్శనం, గో దర్శనం, కూష్మా డబలి, మహా పూర్ణాహుతి, కుంబాభిషేకం, మహా ఆశీర్వాచనములు, తో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారని తెలిపారు, అనంతరం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని, రామనపల్లె ప్రజలు, అలాగే భక్తాదుల్లెల్లరు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవదేవుని ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు తెలియజేసింది.. ఈ కార్యక్రమంలో దేవగుడి భాస్కర్ రెడ్డి, మడక వెంకటసుబ్బయ్య, మీగడ కృష్ణారెడ్డి, కాల్వ కొండారెడ్డి మాజీ సర్పంచ్ నాగరాజు, దేవి రెడ్డి రమారెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ నాయకులు సంపత్ కుమార తదితరులు పాల్గొన్నారు.