PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చట్టసభల్లో బీసి లకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసి లకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్లు కేటాయించాలని ఆయన కోరారు.ఫిబ్రవరి 8,9 తేదీల్లో బీసీ లకు విద్య,ఉద్యోగలలో యాభై శాతం రిజర్వేషన్లు,తదితర డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో నిరసన చేయనున్నట్లు తెలిపారు. మొగల్రాజపురం పి.బి.సిద్దార్ధ కళాశాలలోని ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ఆధ్వర్యంలో ‘హలో బీసీ-ఛలో విజయవాడ’ కార్యక్రమంజరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం బీసీల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోపోతే బీసీలకు అన్ని రంగాల్లో నష్టం జరుగుతుందని అన్నారు.సీఎం జగన్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో బీసీ ల వాటా బీసీ లకు ఇచ్చారన్నారు.నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మంత్రుల కేటాయింపు వరకు జగన్ అందరికి న్యాయం చేశాడని ఆయన అన్నారు.ఇదే పద్దతిలో కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు అండగా నిలవలన్నారు.బీసీ లు చదువుకోవాలని అమ్మవడి పధకం పెట్టి అందరికి రాష్ట్ర ప్రభుత్వం విద్యను అందిస్తున్నదన్నారు.75 సంవత్సరాలు గా బీసీ లకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గుర్తు చేశారు.ప్రజాస్వామ్యం లో జనాభా ప్రాతిపాదికతన వారి వాటా వారికి ఇవ్వాలన్నారు.కుల వివక్ష రూపు మాపాలంటే అధికారంలో వాటా,బడ్జెట్ లో వాటా రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసిన లెక్కల ప్రకారం బీసీలు 14 శాతం జనాభా దాటాక పోవటం బాధాకరమన్నారు.ఇప్పటికే యాభై ఆరు శాతంగా ఉన్న బీసీ జనాభా ప్రకారం రావాల్సిన వాటాను బీసీలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అన్ని రంగాల్లో వాటా రావాలంటే బీసీ లకు ప్రత్యేక మంత్రత్వ శాఖ ఇవ్వాలన్నారు.అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన అన్నారు.అగ్రకులాలకు రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించినప్పుడు లేని బాధ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి ఎందుకని ప్రశ్నించారు.కేంద్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు అన్నారు.లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రశ్నించారు.నరేంద్ర మోడీ బీసీ లకు న్యాయం చేయాలంటే బీసీలు బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలన్నారు. బీసీలు ఇంట్లో కూర్చుంటే తమ కాళ్ళ వద్దకు ఏమి రావన్నారు.బీసీ నాయకులు ఎవరు పదవుల కోసం బీసీలను తప్పు దారి పట్టించవొద్దని అన్ని రంగాల్లో న్యాయం చేసిన వారికే అండగా నిలుద్దామని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు మాట్లాడుతూ బీసీలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అన్నారు.అన్ని పదవుల్లో సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశరన్నారు.నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రజలు చీదరించుకునే విధంగా ఉన్నాయన్నారు.తన తండ్రికి ఇచ్చిన గౌరవం ఆయన తోటి నటులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమ తన కుటుంబానికి మాత్రమే చెందుతుంది అనే విధంగా బాలకృష్ణ మాట్లాడటం సిగ్గు చేటన్నారు..ఎ.ఎన్. ఆర్.,ఎస్.వి ఆర్. లాంటి నటులు తమ నటనతో ప్రజల మనసులు దోచుకున్నారని ఆ విషయం బాలకృష్ణ గుర్తుoచుకోవాలని ఆయన సూచించారు.అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గ నరేష్ మాట్లాడుతూ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు,బీసీ కులగణన జరగాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని నేడు ఈ సమావేశం నిర్వహించమన్నారు.రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే పార్లమెంట్ ముట్టడికి పిలుపు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.బీసీ లు అందరూ తమ హక్కుల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.సంఘం రాష్ట్ర కన్వీనర్ దుర్గ నరేష్ జన్మదినం సందర్భంగా ఆర్.కృష్ణయ్య కేక్ కట్ చేపించి నరేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కారుమురి నాగేశ్వరరావు,ఎం.ఎల్.సి. పోతుల సునీత, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ మెండే జ్యోతి,రాష్ట్ర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author