మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే లక్ష్యం!
1 min read– మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని
19, 20 వార్డుల్లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పల్లెవెలుగు వెబ్ కల్లూరు : బుధవారం నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని నగర మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం 19వ వార్డులో రూ.70 లక్షలతో శ్రీవారి కుటీర్ నుంచి వెంకటాద్రి నగర్ సబ్ స్టేషన్ వరకు డిస్పోసల్ డ్రైన్ నిర్మాణానికి, 20వ వార్డులో రూ.30 లక్షలతో వాసవి నగర్, విజయపూరి కాలనీల్లో డబ్లూ.బి.యం. రోడ్డు నిర్మాణానికి, ధనలక్ష్మి నగర్లో రూ.50 లక్షలతో సిసి కాలువల నిర్మాణాలకు మేయర్, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు అనేక పనులకు శ్రీకారం చుట్టామని, అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరికి కర్నూలు నగరం ఆదర్శవంత నగరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా పనులు కర్నూలులోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, శ్వేత రెడ్డి, లక్ష్మికాంత రెడ్డి, నారయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, పల్లె శారద, నర్సింహులు, వై.వెంకటేశ్వర్లు, వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంత్ రెడ్డి, ఎస్.ఈ. శేషసాయి, డి.ఈ. రవిప్రకాష్ నాయుడు, ఏ.ఈ. జనార్ధన్, ట్యాప్ ఇంస్పెక్టర్ రఫిక్, శానిటేషన్ ఇంస్పెక్టర్ రమేష్, నాయకులు గోపాల్ రెడ్డి, బెల్లం మహేశ్వర్ రెడ్డి, శివరాం, నాగరాజు, చిన్న, తిరుపాలు, శ్రీను, సాయి, బాలచంద్రరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నారాయణమ్మ, చంద్రిక, యూనూస్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.