సంక్షేమ పథకాలు రాకపోతే ఇప్పించే బాధ్యత నాది
1 min read– కర్నూల్ నగరంలోని 7వ వార్డ్ 18వ సచివాలయం పరిధిలో గడప గడప కు
– మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికీ హాజరైన గౌరవ కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక వార్డ్ నాయకులు,కార్యకర్తలు.ఈసందర్భంగా ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో మాట్లాడుతూ ఈ మూడేళ్ళ కాలంలో శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరికి మంచి చెయ్యాలనే ఆలోచనతో అందించే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో వాటిని పరిశీలించాలని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి రావడం జరిగిందని,ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాకపోతే వారికీ ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.ఈసందర్భంగా మూడు సంవత్సరాల పరిపాలన గురుంచి వివరించారు ప్రతి ఇంటికి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం మనది ప్రతి కుటుంబాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన ప్రభుత్వం మనది కోవిడ్ కష్టాలున్నా సరే చెప్పిన సమయానికి చెప్పిన కార్యక్రమం బటన్ నొక్కి మీ ఖాతాల్లో జమ చేసినటువంటి గొప్ప మనసున్న ప్రభుత్వం మనదని పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు ఒక్కొక్కరికి ఒక్కో పథకం పెట్టి ప్రతి వయసు వారికీ కూడా ఆసరా కల్పించినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అన్ని చెప్పారు, సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో భోజనాన్ని పరిశీలించి చుడండి.. గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఏంటో మీకు తెలుస్తుందన్నారు. చదువుకొనే పిల్లలకోసం అమ్మ ఒడి తో అగిపోలేదు బూట్లు బ్యాగ్లు బుక్స్ ఇచ్చాము నాడు నేడు కింద స్కూలును బాగు చేశాం. ప్రతి పిల్లవాడు కూడా గౌరవంగా స్కూలుకు వెళ్లేట్టుగా చేసినటువంటి మనసున్న ప్రభుత్వం మనది. గతంలో మీరు చూస్కోండి ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా మన పిల్లల చదువు కోసం ఒక్క రూపాయి సహాయం చేసినటువంటి సందర్భం ఉందా..? ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడింది ఎందుకు సాధ్యపడిందంటే..? మన కష్టాల్ని మన ఇబ్బందుల్ని నేరుగా కాలి బాటలో 3,648 కిలో మీటర్లు ప్రతి గడప గడపకి నడిసొచ్చి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వివరించారు.ఈ కార్యక్రమం లో స్థానిక వార్డు కార్పొరేటర్ జుబైర్ అహ్మద్ గారు, వైస్సార్సీపీ నాయకులు నవీద్ పర్వీజ్ గారు,షౌ్యైబ్ గారు,అన్వార్ గారు, నజీర్ గారు, ఖలీల్ గారు,లతీఫ్ గారు,మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,ఎ.ఈ రచయ్య గారు , జగదీశ్ , మెప్మా ఆర్ పి & OB’s సచివాలయం సిబ్బంది విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.