మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయలలో, పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం( రిపబ్లిక్ డే) ను నిర్వహించడం జరిగింది, అధికారులు ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు, అనంతరం ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ , వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిఎన్, భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్ లు మాట్లాడుతూ, ఇవాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అని, మన రాజ్యాంగం అతి సుదీర్ఘమైన రాజ్యాంగంగా పేరు పొందిందని, దీనిని రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల,18 రోజులు పట్టిందని వారు తెలియజేశారు, భారతదేశం లో అత్యున్నత చట్టం, ప్రాథమిక రాజకీయ నియమావళి, ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం, విధానాలు, అధికారాలు ప్రభుత్వ సంస్థల విధులు గుర్తించేలా నిర్దేశించిందని తెలిపారు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల విధులను నిర్దేశించడం జరిగిందని ఇంతటి మహత్తరమైనటువంటి రాజ్యాంగానికి మనకు అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు, భారతదేశo, విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన దేశమని, అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి స్వేచ్ఛాయుతను అందించిన గొప్ప దేశం భారతదేశమని వారు తెలియజేశారు, ఎందరో స్వతంత్ర సమరయోధుల పుణ్యఫలం మన భారతదేశం అని, ఆ స్వేచ్ఛ వాయువులను మనందరికీ అందించిన ఆ అమరవీరులందరికి జోహార్ అంటూ వారు నినదించారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.