PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ పార్టీ కి షాక్..

1 min read

– యాదవ,ఎస్సీ కులాలకు చెందిన 35 కుటుంబాలు టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లో చేరిక
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన 35 కుటుంబాలు టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లోకి బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకిసాదరంగాఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి గజ మాలతో సత్కరించారు.టీడీపీ పార్టీ కి చెందిన చిన్న వెంకట రమణయ్య,శ్రీనివాసులు, పెద్దదస్తగిరి, వెంకటేశ్వర్లు, విక్రమ్,చిన్న రామన్న,నాగేంద్ర ప్రసాద్, మునేశ్వరుడు,ప్రసాద్,శివ,శ్రీరామ్,శంకర్,శివ ప్రసాద్, రామకృష్ణా,వై రామన్న,హరి కృష్ణ,శ్రీరాములు,పెద్ద వెంకట రాముడు, కంభగిరి,రంగ నాయకులు,చాకలి చిన్న నాగరాజు,చాకలి పెద్ద నాగరాజు,చాకలి గుర్రప్ప, ఎల్లా గోపాలుడు,కిరణ్,ఎం.నాగరాజు,సంజీవ రాయుడు, సుబ్బరాయుడు, ఓబులేసు,చిన్న ఖాసిం,నాగఓబులేసు,చిన్నరామసుబ్బన్న,నరసింహ,వెంకట రాముడులను వైయస్సార్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే కాటసాని పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో కోటపాడు వైయస్సార్ పార్టీ నాయకులు రామ గోపాల్ యాదవ్,కృష్ణయ్య,ఓబులేసుయాదవ్,ప్రసాద్,రామన్న లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ప్రతి పేదవానికి సంక్షేమ పథకాల అందుతుండడంతో వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని టిడిపి పార్టీ కి చెందిన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరుగుతుందని చెప్పారు.అందులో భాగంగానే కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో బీసీ కులాలకు చెందిన యాదవులు, చాకలి, ఎస్సి కులానికి చెందిన 35 కుటుంబాలు ఈరోజు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగిందని వారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని రాబోయే 2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అభ్యర్థి అయిన తనకు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈరోజు 35 కుటుంబాలను వైయస్సార్ పార్టీలో చేరడానికి కృషిచేసిన కోటపాడు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రామగోపాల్ యాదవును ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈరోజు టిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరిన కార్యకర్తలకు అందరికీ నాయకులకు ఎల్లప్పుడూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది.

About Author