నేడు ఇండస్ పాఠశాలలో రథసప్తమి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు ఇండస్ & మాంటిస్సోరి పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో శనివారం ఉదయం 7 గంటలకు రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్ కె.ఎన్.వి. రాజశేఖర్, ఇండస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గాయినీ రాజశేఖర్, విద్యాసంస్థల మేనేజర్ పి.విల్సన్ అగస్టీన్, ప్రధానాచార్యులు మీనాక్షీ విల్సన్ అగస్టీన్, ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస రెడ్డి, యోగా మాస్టర్ బి.శ్రీనివాసులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఆదిత్య హృదయం పారాయణం, సూర్యనమస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ అష్టాక్షరీ మహామంత్ర పీఠం పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.