పవన్ కళ్యాణ్ నీకు రాయలసీమ ఉద్యమం గురించి తెలుసా..??
1 min read– రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ ఉద్యమకారులపై తోలు తీస్తానంటూ మాట్లాడిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నీకు రాయలసీమ ఉద్యమం గురించి తెలుసా..?? ఏర్పాటు వాద ఉద్యమాలు ఎందుకు పుడతాయో తెలుసా..?? ఏ రోజైనా ఉద్యమాలు చేసావా..??అంటూ ప్రశ్నించారు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్. కర్నూల్ నగరంలోని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాయలసీమ ఉద్యమాలపై వేర్పాటు వాద ఉద్యమాలు మొదలు పెడితే వారిపై తాను ఉగ్రవాది అవుతానంటూ మాట్లాడిన పవన్ కల్యాణ్ మాటలపై రవికుమార్ తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేర్పాటు వాద ఉద్యమాలు ఎందుకు పుడతాయో తెలియని నీవు జనసేన అనే ఒక పార్టీని ఎలా నడుపుతున్నావంటూ ప్రశ్నించారు రాయలసీమ ఉద్యమం ఊరికే మొదలవలేదని రతనాలు రాశులుగా పోసి అమ్మిన ప్రాంతమైన రాయలసీమ తర తరాలుగా నాయకులు,పాలకులు రాయలసీమ ప్రాంతం పై చూపిన తీవ్ర వివక్ష వల్ల రాయలసీమ ఉద్యమం పుట్టిందని నేటికీ వలసలు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్న ఎందుకు స్పందించడం లేదని రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులకు ఎందుకు నీవు మద్దతు ఇవ్వడం లేదని కర్నూలు వస్తే కర్నూలే నా మనసులో రాజధాని అంటూ మాట్లాడిన నువ్వు ఏ రోజు కూడా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని మాట్లాడలేదని నీవు రాయలసీమ ఉద్యమం గురించి, రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయాలతో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తానన్నప్పుడు 1953నాటి ఆంధ్ర రాష్ట్రం తిరిగి ఏర్పాటైనందున రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని మాట్లాడని నీవు నేడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రాజధాని చేస్తానంటే కనీసం నోరు మెదిపి రాయలసీమలో రాజధాని ఉండాలని 1953 నుంచి 56 వరకు రాయలసీమలో రాజధాని కొనసాగిందని మాట్లాడలేని నీవు రాయలసీమ ఉద్యమకారుల తోలు తీస్తావా అన్నారు రాయలసీమలో సరైన ప్రాజెక్టులు లేక నీటి విషయంలో తీవ్ర అన్యాయాలకు గురై కొట్టుమిట్టాడుతున్న రైతులు ఊర్లు వదిలి వలసలు వెళుతున్న, చిన్నారులు చిన్నతనంలోనే వలస బతుకులతో తమ విద్యకు దూరమవుతున్న, చదువును పూర్తి చేసుకున్న నిరుద్యోగులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లి చాలీచాలని జీతాలతో జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న,గల్ఫ్ దేశాలకు వెళ్లి దుర్భరమైన పరిస్థితిలో రాయలసీమ ప్రజలు బ్రతుకుతున్న కనీసం ప్రభుత్వాలను ప్రశ్నించని నీవు పొత్తులో ఉన్న బిజెపి ఇచ్చిన రైల్వే జోన్ గుంతకల్లులో ఏర్పాటు చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నారా అని ఏరోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించావా అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలను రాక్షసులుగా రాయలసీమ ప్రాంతాన్ని బాంబులు కత్తులతో చంపుకునే నరుక్కునే రాక్షస ప్రాంతంగా సినిమాలలో చూపించే మీరు రాయలసీమ ప్రాంతాన్ని వివక్షకు గురిచేయడం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ ఉద్యమకారును తోలు తీస్తానంటూ పవన్ కల్యాణ్ మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటి మాటలు పునరావృత్తం అయితే ఉద్యమకారులంతా కలిసి రాబోవు ఎన్నికల్లో నీ తోలు తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్,వసంత్ తదితరులు పాల్గొన్నారు.