PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ జోనల్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్

1 min read

– విన్నర్ గా నంద్యాల ఫ్రెండ్స్ లెవెల్ టీమ్.
– రన్నర్ గా బనగానపల్లె KNR CC టీమ్.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణం హై స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో గత సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయలసీమ జోనల్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను చారిటబుల్ సభ్యులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు నిర్వహించారు. ఈ పోటీల్లో రాయలసీమ వ్యాప్తంగా 78 టీము లు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు నెలరోజులపాటు ప్రతిరోజు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నంద్యాల ఫ్రెండ్స్ లెవెల్ వర్సెస్ బనగానపల్లె కేఎన్ఆర్ సిసి క్రికెట్ టీంలు తలపడడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఫ్రెండ్స్ లెవెల్ టీం గెలుపొందగా బనగానపల్లె కేఎన్ఆర్ సీసీ టీం రన్నర్ గా నిలిచింది. గెలుపొందిన నంద్యాల ఫ్రెండ్స్ లెవెల్ క్రికెట్ టీంకు లక్ష రూపాయల నగదు మరియు ట్రోపీని, తొందరగా గెలిచిన బనగానపల్లె కేఎన్ఆర్ సీసీ క్రికెట్ టీంకు 50 వేల రూపాయల నగదు మరియు ట్రోపీని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు అందజేశారు. అంతేకాకుండా నెల రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్ను సమర్థవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్ లను అలాగే 78 టీములు పాల్గొన్న క్రికెట్ ను ఎటువంటి స్వార్థపూరితంగా లేకుండా న్యాయ నిర్ణయితలుగా వివరించిన అం పేర్లను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి గారు, కాటసాని తిరుపాల్ రెడ్డి గారు, కాటసాని ఓబుల్ రెడ్డి,ఎస్సై లు రామిరెడ్డి,శంకర్ నాయక్ లు శాలువాలు కప్పి మెమెంటో లను అందజేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి గారు మరియు కాటసాని తిరుపాల్ రెడ్డి గారు మాట్లాడుతు బనగానపల్లె పట్టణంలో హై స్కూల్ గ్రౌండ్ ను ఎంతో తన సొంత ఖర్చులతో తన అన్నగారు ఆధునికరించడం జరిగిందని అయితే ఈ గ్రౌండ్ను ప్రజలు కూడా తన సొంత ఆస్తిగా భావించి గ్రౌండ్ ను చూసుకోవలసిన అవసరం మన ప్రజల మీద ఉందని చెప్పారు. అలాగే తన అన్న కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలకు మరియు క్రీడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. యువకుల్లో చదువులతో చదువులతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభను చాటుకోవాలని లక్ష్యంతోనే తన అన్నగారు క్రీడా క్రికెట్ పోటీలను రాయలసీమ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు మాట్లాడుతూ తన అన్న పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి రాయలసీమ జోనల్ గ్రేస్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని అయితే ఈ పోటీలను ఎలా నిర్వహించాలి అని చాలామందితో తర్జనభజనలు చేసిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ఆర్గనైజర్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రౌండ్ ను కూడా అతి త్వరలోనే ఆధునికరించడం చేయడం జరుగుతుందని చెప్పారు.బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ తన కుమారుడు నాగార్జున రెడ్డి పేరుమీద చారిటబుల్ ట్రస్టు ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు మరియు క్రీడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. అన్న రెండవ కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని లక్ష్యంతో రాయలసీమ జోనల్ స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందని చెప్పారు. అలాగే ఈ హై స్కూల్ గ్రౌండ్ ను తన సొంత ఖర్చులతో ఆధునికరించడం జరిగిందని త్వరలోనే పూర్తిస్థాయిలోగ్రౌండ్నిఆధునికరించడంజరుగుతుందని చెప్పారు. క్రీడల్లో గెలుపు ఓటములనుక్రీడాకారులు సమానంగాతీసుకున్నప్పుడేక్రీడల్లోరాణించగలుగుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంటు ఆర్గనైజర్లు పాపిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కోనేటి దుర్గా, నీలి శివకృష్ణ, అఖిల్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.

About Author