అసౌకర్యాల నడుమ విద్యార్థులు..
1 min read– నాణ్యమైన విద్య అందుతుంది కానీ
– దుమ్ము ధూళితో ఇబ్బందులు…
పల్లెవెలుగు వెబ్ గడివేముల: నాడు నేడు అంటూ బడులను అత్యాధునిక వసతులతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం తెచ్చిన నాడు నేడు పథకానికి గ్రహణం పట్టిందా లేక నిధులు లేమితో పనులు జరగటం లేదా గని గ్రామంలోని రోడ్డుపై ఉన్న ఎంపీపీయూపీ పాఠశాలలో దాదాపు 45 మంది విద్యార్థులు విద్యాబోధన కొనసాగిస్తున్నారు ఈ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు చదువు ఘనంగానే ఉన్న విద్యార్థులకు ఇంగ్లీషు పటిమలో ఆరితేరారు అయితే అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నచందంగా రోడ్డుపై ఉండడమో ఏమో విద్యార్థులకు శాపంగా మారింది నిత్యం వందలాది టిప్పర్లు తిరగడంతో దుమ్ము ధూళి వల్ల దగ్గు జలుబు లాంటి వ్యాధులతో సతమతమవుతున్నామని విద్యార్థులు వాపోయారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సౌకర్యాలు కూడా ఘనంగా కల్పిస్తే ఇంకా బాగుంటుంది.