PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ.. రాష్ట్ర సమాచార కమిషనర్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం (జిల్లా కోర్టు మచిలీపట్నం) ప్రధాన పరిపాలనాధికారి పౌర సమాచార శాఖ అధికారిని స.హ .చట్టం ఆర్జీలకు సరిగా సమాచారం ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషనర్ ఐలాపురం రాజా హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స.హ చట్టం కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ మార్చి 6 తేదీ2013 తేదీన కోరిన సమాచారాన్ని సరిగా సకాలంలో ఇవ్వనందున ది. డిసెంబర్ 16 ,2017 తేదీన ,ఈ కేసును విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ ఐలాపురం రాజా ఆర్జీలను పరిశీలించి సమాచారం ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిబ్రవరి 8 ,2023 తేదీన స్వయంగా హాజరు కావలసిందిగా ఆఉత్తర్వులలో పేర్కొన్నారు .రాష్ట్ర హైకోర్టు రిజిస్టార్ జనరల్ సి.హెచ్ . మానవేంద్రరాయ్ జూన్ 15 , 2016న జారీచేసిన జ్యుడీషియల్ నోటిఫికేషన్ నెం. 14 అమలకు కృష్ణాజిల్లాలో జిల్లా జడ్జి తీసుకున్న చర్యలు అందుకు సంబంధించిన ఆఫీస్ నోట్ ఫైల్ కాపీల సమాచారాన్నిది.మార్చి 11 2017న కోరడం జరిగింది. స.హా .చట్టం ఆర్జీకి జిల్లా కోర్టు ప్రధాన పరిపాలన అధికారి (పౌర సమాచార అధికారి) సరిగా సకాలంలో సమాధానం ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషనర్ కుది.మార్చి21,2017న ఫిర్యాదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం కారణంగా హైదరాబాద్ సమాచార కమిషన్ లో ఉన్న కేసుల రికార్డులు ఆంధ్ర సమాచార కమిషన్ కు రావడంతో 2016, 2017, సంవత్సరాల కేసులు విచారణ ఇప్పుడుజరుగుతూ ఉన్నాయనిఅని ,రాష్ట్రంలోని కోర్టులలో సమాచార చట్టం సరిగ్గా అమలు కాని విషయాన్ని గమనించిన రాష్ట్ర సమాచార కమిషనర్ ఆ ఉత్తర్వులు జారీ చేశారు .సుప్రీంకోర్టు సైతం స.హ చట్టాన్ని గౌరవిస్తుంటే స్థానిక జిల్లా కోర్టులలో సమాచార హక్కు చట్టం బోర్డులు కూడా చాలాచోట్ల కానరావడం లేదుఅని, స.హ చట్టం కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author