రంగనాథ ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ రంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రథసప్తమి ఆలయాలు ఘనంగా జరిగాయని ఆలయ పూజారి విష్ణునారిన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలలో భాగంగా రంగనాథ స్వామికి ఉదయం నుండి విశేష పూజలు అందించి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవలో ఊరేగింపు నిర్వహించారు. రథసప్తమి పురస్కరించుకొని రంగనాథ స్వామిని భక్తుల అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు గోవిందాచార్యులు, సూరేషచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.