బైరెడ్డిని విమర్శించే అర్హత పవన్ కు లేదు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నందికొట్కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విమర్శించే అర్హత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కు లేదని కడుమూరు గ్రామం మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.శనివారం కడుమూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు.అలాంటి నాయకుడితో పాటు,రాయలసీమ నాయకులను విమర్శించే అర్హత సభ్యత సంస్కారం లేని పవన్ కు తగదని హితవు పలికారు.తల తిక్కగా మాట్లాడుతూ యువతను రెచ్చగొడుతూ ఉన్మాదిలా ప్రవర్తించడం సరికాదని పెద్దలపట్ల వినయం, విధేయత ,గౌరవించడం అలవర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో పేరు సహాయ పేట చంద్రశేఖర్ రెడ్డి,గుడిపాడు మహేష్,పైపాలెం ఇ నాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.