యాలూరులో కురవ సంఘం విస్తృత సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సమావేశం యాలూరులో కురవ సంఘం మండల అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి శంకర్ అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న. ప్రధాన కార్యదర్శి రంగస్వామి మాట్లాడుతూ కులస్తులందరూ ఐక్యంగా ఉండాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఐక్యంగా ఉండేదంటలో కురువలను చూసి నేర్చుకునే విధంగా మెలగాలని రాజకీయంగా రాణించాలని విజయనగర సామ్రాజ్యంలో హరిహర రాయలు బుక్కరాయలు మన వంశస్థులు 150 సంవత్సరాలు రాజ్యమేలారని అలాంటి వంశంలో పుట్టిన మనము ఇప్పుడు వ్యవసాయం గొర్రెలు కాపర్లుగా జీవనం సాగిస్తున్నాము మన సమస్యల కోసం అందరూ ఏకతాటిపై నడవాలని అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మనవారు పోటీలో ఉంటే అందరితో ఐక్యంగా ఉంటూ మన ఉనికి చాటుకోవాలని మనం నమ్ముకున్న వారిని మనం అండగా ఉండాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాలూరు జిల్లెల్ల గోస్పాడు నెహ్రూ నగర్ కృష్ణాపురం గ్రామాల కురవ కులస్తులు శిరివెల్ల మండల అధ్యక్షులు లింగమయ్య బాల ఉసెని నరసింహులు శ్రీనివాసులు వెంకటేశ్వర్లు సాంబశివుడు బాలయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.