విజయ పాల డైరీల కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: విజయ పాల డైరీలలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రెహ్మాన్ డిమాండ్ అన్నారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ నంద్యాల, కర్నూలు జిల్లాలో ఉన్న విజయ పాల డైరీ కార్మికులు గత 20 సంవత్సరాలకు పైగా సంస్థలో పనిచేస్తూ విదులను సక్రమంగా సంస్థ అభివృద్ధికి అనుగుణంగా పనిచేస్తున్న కార్మికులు విజయపాల డైరీలో తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ విషయం సంస్థ ఎండీ కి తెలియజేయడము జరిగిందన్నారు. కావున వెంటనే విధుల్లో నుంచి తొలగించిన తొమ్మిది మంది కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకొని వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం ప్యాపిలి మండల తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పాలెం శ్రీనివాసులు, షేక్ .ఇలియాజ్ వీఆర్ఏ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఓబులేష్ ,రామ నాయుడు, రవికుమార్ ,జాఫర్ ,సంతోష్ ,ఫారుక్, మొహమ్మద్,భాష తదితరులు పాల్గొన్నారు.