అదనపు తరగతి గది నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడు
1 min read– నిధుల లేమితో నత్త నడకన నాడు నేడు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ విద్యాలయాల్లో చదవలేక సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యాధునిక వసతులు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చాలని ప్రభుత్వం సంకల్పించిన నాడు నేడు నిధుల లేమితో సాగని నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రభుత్వ ఆశయం విజయవంతమైనట్టే మండల పరిధిలోని పెసరవాయి ఎంపీ యూపీ పాఠశాలలో గతంలో శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల కూల్చి వాటి స్థానంలో ఐదు తరగతి గదులను కొత్తగా నిర్మించాలని దాదాపు 65 లక్షలతో పనులు మొదలుపెట్టి 8 లక్షలతో పిల్లర్స్ స్థాయి నిర్మాణాలు చేసి నిధులు లేక ఆపేశారు మొదటి విడత నాడు నేడు పనుల కింద విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించారు బాత్రూం టాయిలెట్స్ మంచినీటి సౌకర్యానికి వెచ్చించారు 90 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఎన్నారై వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రేకుల షెడ్డు నిర్మించి విద్యార్థులతో అవస్థలు పడడం నిత్య కృత్యం అయిపోయిందని … ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చొరవతో తరగతి గదుల నిర్మాణానికి అనుమతి వచ్చిన రెండో విడత బిల్లులు మంజూరు అయితే నిర్మాణాలు సాగించే పరిస్థితి ఉంటుందని పనులను పర్యవేక్షిస్తున్న హెడ్మాస్టర్ కోటయ్య తెలిపారు మూడు నెలల క్రితం నిర్మాణాలను మొదలు పెట్టామని నిధులు ఉన్న మేర పనులు చేసినట్టు. బిల్లులు మంజూరైన రివాల్వింగ్ ఫండ్ లేక నిధుల లేమితో నిర్మాణాలను అపామని త్వరలోనే నిర్మాణాలను మొదలు పెడతామని తెలిపారు … గతంలో సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ బోధన అంతంత మాత్రమే ఉండేది వార్త రాస్తున్న నేను సందర్శించిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఇంగ్లీష్ ఉచ్చారణ వాటిపై అనర్గళంగా మాట్లాడే విధానం చూస్తే ముచ్చటేసింది ఇంగ్లీష్ బోధనపై ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ మార్పు చెందిన విద్యా విధానం మౌలిక వసతులు తరగతి గదులు త్వరగా పూర్తిచేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆశయం విజయవంతమైనట్టే.