NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్లాక్ ఫంగ‌స్..క‌న్ను, ద‌వ‌డ తొల‌గించారు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: హైద‌రాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన గురిజాల అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగ‌స్ తో మ‌ర‌ణించారు. గ‌త నెలల్లో క‌రోన బారిన‌ప‌డ్డ ఆయ‌న చికిత్స పొంది.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. క‌న్ను ఎర్రబార‌డంతో ఆస్పత్రికి వెళ్లారు. నిజామాబాద్ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు స‌రోజిని కంటి ఆస్పత్రికి వెళ్లాల‌ని సూచించారు. స‌రోజిని వైద్యులు ప‌రీక్షించి బ్లాక్ ఫంగ‌స్ ల‌క్షణాలు ఉండ‌టంతో హైద‌రాబాద్ కేర్ ఆస్పత్రికి పంపారు. కేర్ ఆస్పత్రిలో అంజ‌ల్ రెడ్డికి బ్లాక్ ఫంగ‌స్ సోకింద‌ని నిర్దారించిన వైద్యులు.. ఆయ‌న‌కు ఓ క‌న్ను, ద‌వ‌డ తొల‌గించారు. అనంత‌రం ప‌రిస్థితి విష‌మించ‌డంతో అంజ‌ల్ రెడ్డి మ‌ర‌ణించారు.

About Author