చదువుతోపాటు.. క్రీడలూ.. అవసరమే: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
1 min readరాయచోటి ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి:విద్యార్థులుకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు .రాయచోటి పట్టణంలోని ఐ కె ఒలెంపియాడ్ స్కూల్ లో యూత్ ఐకాన్ వినయ్ కుమార్ అధ్వర్యంలో జరుగుచున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలను శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు.క్రీడాకారులును పరిచయం చేసుకుని సెమీ ఫైనల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూక్రీడాకారులు గెలుపోటములును సమానంగా స్వీకరించాలన్నారు.విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలలతో ఉన్నత లక్ష్యాలును సాధించాలన్నారు. బాలురుతో సమానంగా బాలికలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. యూత్ ఐకాన్ వినయ్ కుమార్ క్రీడాకారుల ప్రోత్సాహానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.గాలివీడు ఎంపిపి జల్లా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.పి ఆర్ టి యు క్రమశిక్షణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఓటమిని సవాళ్లుగా స్వీకరించి గెలుపొందాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐ కె విద్యాసంస్థల అధినేత ఇర్షాద్, వీరాంజనేయులు , అమర్నాథ్ రెడ్డి ,ఒబిలేసు , కరుణాకర్ , లలితమ్మ , పిఈటి ఉపాధ్యాయులు, క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.