PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

1 min read

– G . పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం ,కర్నూల్ G పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ కు ట్రాఫిక్ నియమాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం మాట్లాడుతూ పిల్లలకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం చేసి లైసెన్స్ లేని విద్యార్థులకు వాహనాలు నడపరాదని ఏదైనా యాక్సిడెంట్ చేస్తే A1, ముద్దాయిగా పోలీస్ కేసులో ఇరుకుంటారని పోలీస్ కేసులలో ఉన్న స్టూడెంట్స్కు ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు రావని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసినదిగా స్టూడెంట్స్కు తెలియజేశారు ,స్నేక్ డ్రైవింగ్ ,రాంగ్ రూటు, సెల్ ఫోన్ డ్రైవింగ్ , త్రిబుల్ రైడింగ్ మరియు అతివేగంగా వాహనాలను నడపడం చేయకూడదని, ఇన్సూరెన్స్ లేని ఎలాంటి వాహనాలు కూడా నడపరాదని , హేలిమెంట్ ధరించి వాహనంలో నడపాలని , పాద చారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయకూడదని జీబ్రా లైన్స్ దగ్గరే రోడ్స్ క్రాస్ చేయాలి అని, ఎలా బడితే అలా వానాలను రోడ్లపై పార్కింగ్ చేయరాదని పార్కింగ్ ప్లేస్ లుల్ల మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయవలెనని, తెలియజేశారు లైసెన్స్ లేని స్టూడెంట్స్కు తల్లిదండ్రులు కూడా వాహనాలు నడపడానికి, ఇవ్వకూడదని ఒకవేళ లైసెన్స్ లేని వ్యక్తులకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే వారు ఆక్సిడెంట్స్ చేస్తే తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారని తెలియజేశారు. అలాగే కాలేజ్ లో లైసెన్స్ లేని స్టూడెంట్స్కు వాహనాలు నడపటానికి అనుమతి ఇవ్వకూడదని స్టూడెంట్స్ కి కాలేజీలో అలోవ్ చేయొద్దని ప్రిన్సిపాల్ కు మరియు లెక్చరర్స్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం మరియు మరియు కాలేజ్ ప్రిన్సిపాల్ , లెక్చరర్స్ మరియు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author