చిరుధాన్యాలకు జై..
1 min read– యాజమాన్య పద్ధతుల్లో సాగుకై అవగాహన
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని గడిగరేవుల గ్రామంలో చిరుధాన్యాల విస్తీర్ణం పెంచుట మరియు పోషక విలువల పై అవగాహనకోసం గురువారం నాడు రైతు భరోసా కేంద్రం వద్ద. యునైటెడ్ నేషన్స్ 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా నామకరణం చేశారు .ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల శాస్త్రవేత్తలు నరసింహ .అరుణ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి. పాల్గొన్నారు. 60 రోజుల నుంచి 90 రోజుల పంట కాలం గల కొర్ర రకాలైన గరుడ , రేనాడు , మహానంది యాజమాన్య పద్ధతులపై మరియు జొన్న రకాల పైన వాటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు విస్తీర్ణం పెంచడం పైన మరియు చిరుధాన్యాల వినియోగం తో ఆరోగ్య లాభదాయకాలపై రైతులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెప్టెంబర్ 2023వ సంవత్సరం లో పూర్తిగా ఐవైఎం కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సహాయ వ్యవసాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్ 2023 వ సంవత్సరంలో జనవరి నెల మొదలుకొని డిసెంబర్ వరకు వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు చిరుధాన్యాలు పై చేసేటువంటి కార్యక్రమాల పైన రైతులకు అవగాహన కల్పించారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.