పాత పెన్షన్ సాధనకై కలిసి రండి
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎన్ .ప్రతాప్ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దుకై ఓ పి ఎస్ సాధనకై కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కే సత్య ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు. సిపిఎస్ పై ఆగాహన లేదంటున్నారు . రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని చెబుతూనే మరో ప్రక్క ఆర్థిక పరిస్థితులు బాగా లేవని అందువల్ల పాత పెన్షన్ విధానం అమలు చేయడం అసాధ్యమని అంటున్నారు . సిపిఎస్ స్థానంలో జిపిఎస్ అనే కొత్త విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగస్తులు ఒప్పుకోమన్నారు .హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గడ్ ,రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వారి కంటే ముందుగా హామీ ఇచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన ముఖ్యమంత్రి మాట తప్పడం చాలా విచారకరమన్నారు .సిపిఎస్ అయినా ,జిపిఎస్ అయినా ఉద్యోగులకు ఎలాంటి లాభం లేదని ఓపిఎస్ తోనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భద్రత అని అన్నారు .కాబట్టి ప్రభుత్వం వెంటనే ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ నెంబర్ యు దస్తగిరి ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు ఆర్థిక కార్యదర్శి ఎం. విజయకుమార్ .గౌరవ అధ్యక్షులు బి సుధాకర్, సతీష్ మల్లికార్జున, కే గోపాల్ ,ఎస్ లక్ష్మీనాయక్ ఆగస్ట్రస్, వెంకటేశ్వర ఆచారి, జీ డేవిడ్, ఏసీ సన్నన్న ,వై మనోహర, కేఎం నాగరాజు ,బి శ్రీను ,సుధాకర్ ,పుల్లయ్య మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.