దుమ్ము రేగుతుంది.. అస్తవ్యస్తంగా రోడ్లు..
1 min read– మరమ్మతులకు మోక్షం ఎప్పుడు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని ప్రధాన రహదారులు దెబ్బతిని గుంతల మయంగా మారడంతో భారీ వాహనాలు వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారులు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండలంలోని పెసరవాయి రహదారి నూతన తారు రోడ్డు వేయడంతో మండలంలోని ప్రధాన రహదారి అయిన బూజునూరు నుండి తలముడిపి బాట వరకు గుంతల మయంగా మారిన రహదారులను కనీసం ప్యాచ్ వర్క్ అన్న చేయించాలని మండల వాసులు కోరుతున్నారు ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే దాదాపు అరగంట పడుతుందని వెన్నునొప్పి దుమ్ము దులివల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొంటున్నామని ద్విచక్ర వాహనదారులు వాపోయారు రోడ్డు ప్రమాదాలకు నిత్యం కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ రహదారులను ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని అధికారులను కోరుతున్నారు.