‘ఐరన్ డోమ్’తో మిసైల్స్ ఆటకట్టించిన ఇజ్రాయిల్
1 min readపల్లెవెలుగు వెబ్: ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ. పాలస్తీన రాకెట్లను పటాపంచలు చేసింది. గాలిలో ఎగిరి వస్తున్న మిసైల్స్ ను గాల్లోనే నిర్వీర్యం చేస్తుంది. ఇజ్రాయిల్ దేశ అమ్ములపొదిలో ఉన్న మహత్తర ఆయుధం.. ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ. ఇటీవల ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య జరిగిన దాడుల్లో ఐరన్ డోమ్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. వేలాది ఇజ్రాయిల్ పౌరుల ప్రాణాలను కాపాడింది. గాజా నుంచి వచ్చిన వెయ్యికి పైగా మిసైల్స్ ను గాల్లోనే నిర్వీర్యం చేసింది. కేవలం రెండు, మూడు రాకెట్లు మాత్రమే ఇజ్రాయిల్ మీద దాడి చేశాయి.
ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి ?
ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అంటే.. భూమి మీద నుంచి గాల్లో.. తక్కువ దూరంలో ఉన్న మిసైల్స్, రాకెట్లను గాల్లోనే నిర్వీర్యం చేసే వాయి రక్షణ వ్యవస్థ. 2006లో లెబనాన్, ఇజ్రాయిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో లెబనాన్, ఇజ్రాయిల్ మీద పెద్ద ఎత్తున రాకెట్లతో దాడి చేసింది. ఈ యుద్ధం తర్వాత ఈ వ్యవస్థను.. ఇజ్రాయిల్ రూపొందించింది. వాయిదాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రాయిల్ ఈ టెక్నాలజీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసింది. ఐరన్ డోమ్ వ్యవస్థను రూపొందించేందుకు దాదాపు 6 సంవత్సరాలు ఇజ్రాయిల్ కృషి చేసింది. 2011లో మొదటి సారిగా ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఉపయోగించింది. పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయిల్ మీద దాడి చేసే రాకెట్లను గాల్లోనే నిర్వర్యం చేసే విధంగా ఈ వ్యవస్థ డిజైన్ చేయబడింది.
ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఎలా పని చేస్తుంది :
ఐరన్ డోమ్ వ్యవస్థ ప్రధానంగా మూడు వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఈ ఐరన్ డోమ్ ఉన్న ప్రాంతంలో ఒక కవచంగా పని చేస్తుంది. శత్రుదేశాల నుంచి వచ్చే రాకెట్ల దాడి నుంచి ఇవి కాపాడుతాయి. ఐరన్ డోమ్ వ్యవస్థలో రాడార్ ను ఉపయోగిస్తారు. ఈ రాడార్ శత్రు దేశం నుంచి వచ్చే మిసైల్స్ ను కనిపెడతాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ శత్రు దేశం నుంచి వచ్చే మిసైల్స్ వల్ల కలిగే ముప్పును కూడ విశ్లేషిస్తాయి. జనసంచారం ఉన్న ప్రదేశం మీద శత్రు దేశం మిసైల్ తో దాడి చేస్తే.. ఐరన్ డోమ్ వ్యవస్థ మరో మిసైల్ తో ఎదురు దాడి చేసి.. శత్రు దేశ మిసైల్ ను గాల్లోనే నిర్వీర్యం చేస్తుంది. ఇజ్రాయిల్ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఐరన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పాలస్తీన నుంచి వచ్చే మిసైల్స్ ను సాధ్యమైనంత వరకు నాశనం చేసే శక్తి ఇజ్రాయిల్ కు ఉంది. ఐరన్ డోమ్ వాయి రక్షణ వ్యవస్థ.. 90 శాతం ఖచ్చితత్వంతో పని చేస్తుందని ఇజ్రాయిల్ చెబుతోంది. అయితే.. 80 శాతం ఖచ్చితత్వంతో పని చేయగలదని రక్షణ శాఖ శాస్ట్ర వేత్తలు చెబుతున్నారు.