PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారుల తీరుపైన సీపీఐ నాయకులు అసంతృప్తి

1 min read

– ప్రజలకు సమాచారం లేకుండానే సామాజిక తనిఖీ బహిరంగ సభ
– గంటకే మమాంటూ ముగించిన అధికారులు
– అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన సీపీఐ నాయకులు
– ఉపాధి హామీ సామాజిక తనిఖీ మళ్ళీ నిర్వహించాలి
– గంటలోపే పూర్తి చేయడం వెనక అంతర్యమేమిటో
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉపాధి హామీ పథకం లో జరిగిన అవినీతిని బయట పడుతుందనేమో లేక అధికారులకు సభ నిర్వహించడం ఇష్టం లేకనో అధికారులకు ఓపిక లేకనో కానీ సామాజిక తనిఖీ బహిరంగ సభ ను అధికారులు తూస్ మని గంటకే ముగించి మమ అనిపించారు.మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే బహిరంగ సభ ను నిర్వహించిన అధికారుల తీరుపైన సీపీఐ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రం బంగ్లా ఉపాధి హామీ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక తనిఖీ గంటసేపు మాత్రమే నిర్వహించారన్నారు. 12 గ్రామ పంచాయతీలు కలిపి మండలంలో దాదాపు రూ. 4.50 కోట్లు పనులు జరిగాయని, వాటికి సంబంధించిన నివేదికలు చదవడం అంత త్వరగా ఎందుకు పూర్తి అవుతుందని దీని వెనక అంతర్యామేమిటని తక్షణమే ఈ విషయంపై కలెక్టర్ న్యాయ విచారణ చేసి మళ్లీ సామాజిక తనిఖీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు వి.రఘురామూర్తి లు డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీలో ఎంత అవినీతి జరిగింది అనే విషయంపై నిర్వహించిన సామాజిక తనిఖీలో ఇద్దరు జిల్లా అధికారులు పాల్గొని తూతూ మంత్రంగా నిర్వహించారని కనీసం ఆయా గ్రామాల ప్రజలకు సమాచారం లేకుండా పిలువకుండా నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కనీసం ఒక్కొక్క గ్రామ పంచాయితీ పనులపై 20 నిమిషాలు కూడా చర్చ జరగలేదంటే ఏం జరిగిందో అర్థం చేసుకోవాలని వారన్నారు.. పెన్షన్లు,రోడ్లు, ఉపాధి హామీ పనుల పై అనేక సార్లు ఫిర్యాదులు అందాయని ప్రజలకు సక్రమంగా అందడం లేదని అధికారుల దృష్టికి చాలామంది తీసుకొచ్చారని అలాంటి వాటి గురించి చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. గతంలో దాదాపు 7 గంటల పాటు నిర్వహించే సామాజిక తనిఖీ ఇప్పుడు గంటకే లోపే ముగించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టికిందకరించి మళ్లీ సామాజికతానికి పకడ్బందీగా నిర్వహించిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయం పై రాతపూర్వకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీనివాసులు, దినేష్, మహానంది, పోచయ్య, రాజు, భాష,వీరేంద్ర,వినోద్ తదితరులు పాల్గొన్నారు.

About Author