అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలో నందివర్గం గ్రామం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు నిర్వహించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి మూడున్నర సంవత్సర కాలంలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఏఏ సంక్షేమ పథకాలు ఎంత మేర లబ్ధి పొందారో ప్రజలకు తెలియజేసుకుంటూ అలాగే కాలనీలో గల ప్రధాన సమస్యల గురించి ప్రజలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. నందివర్గం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అక్కడి కాలనీవాసులు డ్రైనేజీ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా డ్రైనేజీ నిర్మాణాల కొరకు నిధులు మంజూరు చేయించడం జరిగింది. నిర్మాణాలను స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఆ నిధులను ఆ సచివాలయ పరిధిలో గల అత్యధిక ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి పనుల నిర్మాణం కొరకు ఆ నిధులను కేటాయించడం జరిగిందని అందులో భాగంగానే గతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు డ్రైనేజీ సమస్యను ప్రాధాన్యత సమస్యగా తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే నిధులు మంజూరు చేయించడం జరిగిందని అందులో భాగంగానే ఆ నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించడం జరిగిందని చెప్పారు. పార్టీలు తమ ముఖ్యమంత్రిని – తమను ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మన ముఖ్యమంత్రి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నియోజకవర్గ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు సచివాల య సిబ్బంది వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.