ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పై అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ ఆధ్యర్యము లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము సందర్బంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఎల్. రాఘవేంద్ర గౌడ్ ఆరోగ్య విద్యా భోదకుడు పట్టణంలో ని వెంకటరెడ్డి కాలనీ లో వ్యాది నిరోధక టీకాల కార్యక్రమం ను పర్యవేక్షణ చేసి,4 కీ మెసేజెస్, కోల్డ్ చైన్ ఉండేటట్ల చూసుకోవాలని,6వారాలు,14 వారల వేచే ఫ్రాక్షనల్ ఐ పి వి తో పాటు, 9 వనెలలో వేచే ఎం ఆర్ 1, జె ఈ, పిసివి, విటమిన్ ఏ, తోపాటు బూస్టర్ డోస్ ఫ్రాక్షనల్ ఐ పి వి ( పోలియో టీకా) ని వేయవలెను. క్యాన్సర్ పైన అవగాహన కల్పిస్తూ నోటి, ఈసోపేఫగుస్, బ్రెస్ట్, సర్వేయికల్, అబడామినేల్ కాన్సర్స్ వస్తూన్నాయి కాబట్టి, ప్రాథమిక స్థాయి లో శరీరం పైన నొప్పిలేని గడ్డలు పెరుగుతూ ఉండడము, నోటిలో పుండ్లు, నెలసరి లో రక్తం ఎక్కువగా పోవడం, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలను గుర్తించి పరీక్షలు చేయించు కోవాలి తగిన చికిత్స తీసుకోవాలి. పోగాకు ఉత్పత్తులు బీడీ, సిగరేట్,పాను పరాగు వాడకూడదు, తినేహారములో కొవ్వు పదార్తములు తగ్గించడం, సమయానికి ఆహరం భూజించాలి, ఆకుకూరలు కూరగాయలు, పండ్లు బాగా తీసుకోవాలి అని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఎచ్ పి శ్రీజ, ఆరోగ్య కార్యకర్త అరుణ, ఆశలు అరుణ, ప్రజలు పాల్గొన్నారు.