‘కర్ఫ్యూ’లో బయటకు రావొద్దు..!
1 min read– మున్సిపల్ కమిషనర్ రాంబాబు
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: రాయచోటి మున్సిపల్ పరిధిలోని ప్రజలు, వ్యాపారస్తులు ప్రతిఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించి కర్ఫ్యూ సడలింపునకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాంబాబు పేర్కొన్నారు. సోమవారం డియస్ పి వాసుదేవన్ మరియు ఇతర అధికారులతో లాక్డౌన్ సడలింపు, కర్ఫ్యూ అమలు, తదితర అంశాలపై ప్రభుత్వం నిర్దేశించిన సమయంపై రాయచోటి DSP, అర్బన్ CI లతో చర్చించారు.ఈ సందర్భంగా కమిషనరు రాంబాబు మాట్లాడుతూ కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలో నిత్యావసర సరుకులు తీసుకొని ఇండ్లకు చేరాలని ప్రజలకు సూచించారు.