దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
1 min read– యువత చెడు మార్గాలను వీడి సన్మార్గంలో నడవాలి
– యువతకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యం
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని యువత చెడు మార్గాలను వీడి సన్మార్గంలో నడిపేది క్రీడలని చదువుతోపాటు క్రీడలు కూడా యువతకు ముఖ్యమని ప్రతి క్రీడాకారుడు దేశం తరఫున ఆడాలని ఆత్మకూరు సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఆత్మకూర్ పోలీస్ స్టేషన్లో సీఐ చేతుల మీదుగా లిటిల్ లెజెండ్స్ టీం క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూర్ అంటే క్రీడలకు మారుపేరు అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ రాష్ట్ర స్థాయిలో రాణించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలామంది ఉన్నారు అన్నారు. ప్రతి క్రీడాకారుడు తాను ఆడుతున్న క్రీడల్లో పట్టుదలతో ఆడాలన్నారు. యువతను సన్మార్గంలో నడిపే శక్తి క్రీడలకు సాధ్యమన్నారు. ప్రతి క్రీడాకారుడు యువత దశ నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని జీవితంలో ఎదగాలన్నారు. అలాగే క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న శ్రీరాములు అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ క్రీడా దుస్తుల కార్యక్రమంలో క్రికెట్ సీనియర్ క్రీడాకారుడు ఏఎండి రఫీ లిటిల్ లెజెండ్స్ జట్టు సభ్యులు ఉన్నారు.