PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహశీల్దార్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

– వచ్చిన ఫిర్యాదుల విషయం లో అధికారులు న్యాయ, న్యాయాలు పరిశీలించాలి
– ప్రజలతో అధికారులు సమన్వయంతో మాట్లాడాలి.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం లో 90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ప్రారంభించారు. నూతన రెవెన్యూ భవన కార్యాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నూతన భవనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి మండల తాసిల్దార్ కార్యాల భవనం ను మన వైయస్సార్ ప్రభుత్వం హయాంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకోడం జరిగిందని చెప్పారు. పాత మండల తాసిల్దార్ కార్యాలయం బ్రిటిష్ కాలం దాటి భవనాల్లోనే అధికారులు పరిపాలన కొనసాగించడం జరిగిందని , వర్షాకాలం వచ్చిందంటే పాత కార్యాలయం లోని రికార్డ్స్ అంతా వర్షంతో తడిసి ముద్ద అయ్యేదని , అలాగే గతంలో కార్యాలయం లోని రికార్డ్స్ కాలి బూడిద అయ్యాయని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సౌకర్యవంతమైనటువంటి భవనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని చెప్పారు.90 లక్షల రూపాయలతో నిర్మించి ప్రారంభించిన ఈ భవనాన్ని అధికారులు సిబ్బంది తన సొంత ఇంటి పరిశుభ్రత వలె ఈ కార్యాలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. కార్యాలయం చుట్టూ కూడా మొక్కలను నాటి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అధికారులు ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. మండలంలోని ప్రతి కుటుంబానికి రెవెన్యూ కార్యాలయానికి ఎంతో అనుబంధం ఉంటుందని చెప్పారు. తను కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ప్రజలు రెవెన్యూ సమస్యలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని కాబట్టి కార్యాలయానికి వచ్చే ప్రతిదారునితో ఎంతో అవయవ సంబంధంగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆదేశించారు. గ్రామంలో ఎక్కువగా భూ సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని కాబట్టి ఎవరికీ న్యాయంగా ఉంటే వారికి మాత్రమే అధికారులు పనిచేసి పెట్టాలని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయలకు ఒక సిస్టం అనేది లేకుండా వుండేదని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థలు తీసుకురావడంతో చాలా వరకు సమస్యలను సచివాలయాల పరిధిలోనే పరిష్కారం లభిస్తుందని అక్కడ పరిష్కారం కాని సమస్యను మాత్రమే తహసిల్దార్ కార్యాలయానికి ప్రజలు రావడం జరుగుతుందని చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం కానప్పుడు వచ్చిన ఫిర్యాదుదారులు లబ్ధిదారులు భావేద్వేగాలకు లోనయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతున్నాయని అలాంటి ఆలోచనలు రానీయకుండా అధికారులు సమిష్టి కృషి తో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. వైయస్సార్ ప్రభుత్వంలో అర్హులైన ఏ పేదవాడు కూడా కన్నీరు పెట్టుకోకూడదనేదే మా ప్రభుత్వ యొక్క ధ్యేయం అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు అర్హులైన పేదలకు ఆ సంక్షేమ ఫలాలు అందించలేక పోతే ఆ చెడ్డ పేరు వైయస్సార్ పార్టీకి వస్తుందని చెప్పారు. అందుకే జగనన్న ప్రభుత్వంలో రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే జగనన్న గుహకు పథకాన్ని తీసుకురావడం జరిగిందని దీని రైతులు కూడా సద్వినియోగం చేసుకొవాలని చెప్పారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు మంచి సేవ చేసి ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు మానసవీణ, జడ్పిటిసి సభ్యురాలు సుబ్బలక్ష్మమ్మ, పట్టణ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, గుండం శేషి రెడ్డి, మెట్టపల్లి రమణ గౌండ కమ్మ గిరి వాళ్ల బాలు పకీర షరీఫ్ డాక్టర్ మొహమ్మద్ హుస్సేన్ సురేష్..మండల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రోడ్లు భవనాల శాఖ సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ డివిజనల్ ఇంజనీర్ సునీల్ రెడ్డి, మండల తహసిల్దార్ శ్రీనివాసులు, మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, కొలిమిగుండ్ల మండల తహసిల్దార్ ఆల్ఫ్రెడ్, అవుకు మండల అభివృద్ధి అధికారి అజాం ఖాన్,ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీరు హుసేని, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About Author