PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో అమూల్ కు పాల సేకరణ 70శాతం జరగాలి

1 min read

– పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లాలో అమూల్ కు పాల సేకరణ 70 శాతం పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో తహసిల్దారులు, ఎంపీడీవోలు,జగనన్న పాలవెల్లువ ఆర్ఐసి లు, మెంటర్స్ తో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం, అమూల్ కు పాలసేకరణపై జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయ తో కలిసి జిల్లా కలెక్టర్ గిరిష పిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. అన్నమయ్య జిల్లాలో 12,871 మంది రిజిస్టర్ అయిన పాడి రైతులు ఉన్నారన్నారు. . జిల్లాలోని ప్రతి పాడి రైతుకు డిసిసి బ్యాంకు ద్వారా 30 నుంచి 50 వేల రూపాయల వరకు రుణం ఇప్పించే ఏర్పాటు చేయాలన్నారు. 30 వేలు రుణం తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి గేదెలు కొనుగోలు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో 1.60 లక్షల రూపాయలు రుణం ఇవ్వడం జరుగుతుందని పాడి రైతుకు తెలియజేయాలన్నారు.పాడి పశువులు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పాలు ఇచ్చేందుకు నాణ్యమైన దాన, మినరల్ మిక్సర్, కాల్షియం మొదలైన ఇన్పుట్స్ పాడి రైతులకు ఇవ్వడం జరుగుతుందని తెలపాలన్నారు. ప్రస్తుతం అమూల్ కు పాలు పోసే వారికి ఒక లీటర్ కు 35 నుంచి 40 రూపాయల వరకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి పాల ధర పెంచడం జరుగుతుందని పాడి రైతులకు తెలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జగనన్న పాలవెల్లువ అమూల్ వచ్చిన తర్వాత పాలు పోసే పాడి రైతులకు పాల రేటు పెంచడం జరిగిందన్నారు. కావున జిల్లాలోని పాడి రైతులందరూ అమూల్ కు పాలు పోసి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అమూల్ కు పాల సేకరణ విరివిగా జరిగేందుకు తహసిల్దారులు, ఎంపీడీవోలు, స్థానిక పశువైద్యాధికారి సమన్వయంతో అమూల్ కు పాలు పోయడం వల్ల పొందే లబ్ధి వివరాలు పాడి రైతులకు కూలం కుశంగా వివరించాలన్నారు. ప్రభుత్వం పశువులకు ఇచ్చే నాణ్యమైన దాన, పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పశు వైద్యాధికారులు పలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని వారికి తెలియజేయాలన్నారు. ప్రతి పాల సేకరణ కేంద్రంలో ఒక నోడల్ అధికారిని నియమించి గ్రామ వాలంటీర్ సహకారంతో ఎక్కువమంది పాడి రైతులు అమూల్ కు పాలు పోసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి అమూల్ కు పాల సేకరణ ను సంబంధిత అధికారులు సీరియస్ గా తీసుకొని జిల్లాలో70 శాతం పైచిలుకు పాల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డిఓ రంగస్వామి, పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పెళ్లై, కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, డిఆర్ డిఏ పి డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

About Author