PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ఎమ్మెల్యే బీసీ పై చర్యలు తీసుకోవాలి

1 min read

– ఎస్సై శంకర్ నాయక్ సస్పెన్షన్ ఎత్తివేయాలి…
– నంద్యాల ఎస్పీ కార్యాలయంలో సీసీకి వినతి పత్రం అందజేసిన గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ సంఘాల నేతలు
నిజనిజాలు నిగ్గు తేల్చకుండా సస్పెన్షన్ విధించడం సరికాదు.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లి : ఘటనపై నిజనిజాలు నిగ్గు తేల్చకుండా ఎస్ఐ శంకర్ నాయక్ పై సస్పెన్షన్ విధించడం సరికాదని, పార్టీలకు అతీతంగా విచారణ చేపట్టి శంకర్ నాయక్ సస్పెన్షన్ ఎత్తివేసి మాజీ ఎమ్మెల్యే బీసీ పై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పలు గిరిజన సంఘాల నేతలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిసికి వినతిపత్రం అందజేశారు.శనివారం నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఎవరు లేకపోవడంతో గిరిజన సంఘాల నేతలు సిసికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ దస్తగిరి అనే యువకుడి మృతి కేసులో ఎలాంటి ఆధారాలు చూపకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరుపకుండానే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణలతో ఎస్సై పై కేసు పెట్టడమే కాకుండా సస్పెన్షన్ చేయడం చాలా దారుణమని అన్నారు.దస్తగిరి మృతి తెర వెనుక కడప జిల్లా కమలాపురం ఎస్ఐ, మాజీ ఎమ్మెల్యే కుట్రపన్ని దస్తగిరిని ఫోన్ లో రెచ్చగొట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడండి అంటూ ప్రేరేపించి యువకుడి చావుకు కారకులు వీల్లేనని తెలిపారు.ఎస్సై చిన్న పెద్దయ్య కాల్ డీటెయిల్స్ పరిశీలించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిజనిజాలను నిగ్గు తెల్చకుండా నిజాయితీగల అధికారిని సస్పెన్షన్ విధించడం ఏమాత్రం సరికాదని అన్నారు.దస్తగిరి మృతికి కారణమైన కమలాపురం ఎస్సై పై వెంటనే కేసు నమోదు చేసి ఆయనను విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అమాయక ఎస్ఐపై నిందలు మోపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు, జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలు నాయక్, బనగానపల్లి ఎంపీపీ ఈశ్వర్ నాయక్, వెలుగోడు వైస్ ఎంపీపీ కొడావత్ శంకర్ నాయక్, చిన్న రాజుపాలెం తండ సర్పంచ్ పి రమేష్ నాయక్ , వైస్ సర్పంచ్ ఎం బాలు నాయక్ కరివేన రవీంద్ర నాయక్, వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ కార్యదర్శి బిలావత్ శంకర్ నాయక్, గుంతకందల సుధాకర్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author