అతీంద్రియ శక్తులు ఏవీ లేవు..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వ్యక్తి జీవితంలో అనునిత్యం సైన్స్ తో పయనం,మనిషి తన దైనందిన జీవితంలో ప్రతీది సైన్స్ ను ఉపయోగించుకునే మనుగడ సాగిస్తాడని విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో కర్నూల్ నగరం లో బిర్లా కాంపౌండ్ లోని జె.వి.వి కార్యాలయం లో “మ్యాజిక్ -. మహత్తులు – సైన్స్ అనే అంశం పై జెవివి కార్యకర్తలకు రెండు రోజులు శిక్షణా కార్యక్రమము విజ్ఞాన దర్శిని రమేష్ హైదరాబాద్ బృందం వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అతీంద్రియ శక్తులు ఏవీ లేవని సైన్స్ ఆధారంగా క్రియేట్ చేసిన మేజిక్ అంశాలే అన్నారు. వేదిక వ్యవస్థాపక సభ్యులు డా. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించమని రాసుకుంటే దాని అమలులో మాత్రం వెనుకబడి వుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ మాట్లాడుతూ విజ్ఞానం ఒక వైపు కొత్త పుంతలు తొక్కుతు వుంటే మూఢ నమ్మకాలు అదే స్థాయిలో ప్రబలుతున్నాయు అన్నారు. సైన్స్ ను వాడుకొని మహిమలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారని అందుకే వాటిలోని సైన్స్ ను తెలిపేందుకే ఈ శిక్షణా కార్యక్రమం అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్..జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్, జనరల్ సెక్రెటరీ ప్రతాపరెడ్డి,జాతీయ కమిటీ నాయకులు రమణా రెడ్డి, మహమ్మద్ మియ్యా,రాష్ట్ర కమిటీ సభ్యులు అధ్యక్షులు శేషాద్రి రెడ్డి, మంజుర్ భాష,యోహాను,సమతా నాయకులు సుజాత,జాతీయ మేజిక్ కమిటీ అధ్యక్షులు హరేరామ్, విజయకుమార్ , చెన్నకేశవ రెడ్డి తదితరులు పాల్గొంటారు.